![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారీ '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 400 లో.. కృష్ణ, ముకుంద, మురారి , అదర్శ్ కలిసి రెసాట్ నుండి కార్ లో ఇంటికి బయల్దేరుతారు. అయితే దారిలో వస్తుండగా కృష్ణ మనసులో అనుమానం మొదలవుతుంది.
ఇక కారులో వెనుకాల సీటులో కూర్చున్న ముకుంద, ఆదర్శ్ లని చూసిన కృష్ణ.. అలా దూరమెందుకు కూర్చున్నావ్ ముకుంద.. అదర్ అదర్శ్ దగ్గరగా కూర్చోమని అంటుంది. నాకు ఇలాగే కంఫర్ట్ ఉందని ముకుంద అంటుంది. లేదు భార్యెప్పుడు భర్తకి దగ్గరగా ఉండాలని కృష్ణ అంటుంది. తనకి కంఫర్ట్ గా ఉందంట కదా వదిలెయ్ అని మురారి అంటాడు.కంఫర్ట్ కాదు దానికన్నా జాగ్రత్త ముఖ్యమని, అది భర్తనే చూసుకోగలడని కృష్ణ అంటుంది. ఇక తప్పేలా లేదని ఆదర్శ్ దగ్గరగా జరిగి కూర్చుంటుంది ముకుంద. ఇక తపవాల్చి కూర్చోమని కృష్ణ అంటుంది. అయ్యో నిజం చెప్పేదాకా నాకు ఇది తప్పేలా లేదని ముకుంద అనుకుంటుంది. ఇక కృష్ణ బలవంతంతో ఆదర్శ్ భుజం మీద తలవాల్చి కూర్చుంటుంది. ఆ తర్వాత ముకుంద కావాలనే నటిస్తుందనే అనుమానంతో కృష్ణ ఉంటుంది. అందరు ఇంటికొచ్చాక ఏం అయిందని అడుగుతుంది. ముకుంద కాలు బెణికిందని కృష్ణ అంటుంది. అది చూసి రేవతి ఫీల్ అవుతుంది. మధుకి మాత్రం డౌట్ అలాగే ఉంటుంది. ముకుంద, ఆదర్శ్ కి దూరంగా ఉందా.. దగ్గరగా ఉందా అని మధు అడుగగా.. ముకుందకి అలా గాయం జరిగితే ఇప్పుడు అవన్నీ అవసరమా అని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ యాక్ట్ చేస్తుంది.
ఇక అదంతా చూసి నిజమేమోనని రేవతి వాళ్ళు అలసిపోయారేమోనని ఫ్రెషప్ అయి రమ్మంటుంది. మరోవైపు కృష్ణ మనసులో ముకుంద ఇప్పటివరకు చేసినవన్నీ గుర్తుచేసుకుంటూ తను యాక్ట్ చేస్తుందని రియలైజ్ అవుతుంది. అప్పుడే మురారి వచ్చి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావని కృష్ణని అడుగుతాడు. అదేం లేదని చెప్పి, అదర్శ్, ముకుందలని ఒక్కటి చెయ్యాలని కృష్ణ అనగానే.. ఒక్కటికాకపోతే అదర్శ్ కాశ్మీర్ నుండి ఎందుకు వస్తాడని మురారి అంటాడు. తరువాయి భాగంలో పంతులిని పిలిపించి శోభనానికి ముహుర్తాలు చూడమని చెప్తుంది కృష్ణ. అయితే ఒక్క జంటకి మాత్రమే శోభనానికి ముహుర్తం చూడాలని, అది అదర్శ్, ముకుందలకే ఉందని చెప్పాలని పంతులిని రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ. మంచి జరుగుతుందంటే చేస్తానని పంతులు చెప్పి అదే చెప్తాడు. ఇక ముకుంద షాక్ అవుతుంది. మిగతా వాళ్ళంతా సంతోషపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |